అతనితో కొత్త రిలేషన్ మొదలు పెట్టిన స్టార్ యాంకర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లితెర మీద తన అల్లరి తనంతో యాంకరింగ్ తో అలరించే శ్రీముఖి బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచినా విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్స్ వరకు వెళ్ళిన శ్రీముఖి రాహుల్ సిప్లిగంజ్ కంటే కొద్దిపాటి ఓట్ల తేడాతో టైటిల్ ను మిస్ చేసుకుంది. బిగ్ బాస్ కు వెళ్లకముందు మంచి స్నేహితులుగా ఉన్న శ్రీముఖి, రాహుల్ హౌజ్ లో శత్రువులుగా మారారు. ఒకరిని ఒకరు తిట్టుకోవడం కూడా జరిగింది.

చివరి రెండు వారాల్లో రాహుల్, శ్రీముఖిల గొడవ చాలా హైలెట్ అయింది. అయితే ఇక జన్మలో రాహుల్ తో మాట్లాడను అనుకుంది శ్రీముఖి. అలానే బయటకు వచ్చాక శ్రీముఖి రాహుల్ ను దూరం పెడుతూ వచ్చింది. ఒక ఇంటర్వ్యూ లో రాహుల్ శ్రీముఖికి కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదని చెప్పాడు. అయితే ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేశారు ఇద్దరు.

గతం గతః అనుకుంటూ ఈ ఇద్దరు మళ్ళీ కలిసిపోయారు. ప్రసుత్తం రాహుల్ శ్రీముఖి కలిసి దిగిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బయట స్నేహితులైన రాహుల్, శ్రీముఖి బిగ్ బాస్ హౌజ్ లో గొడవపడ్డారు. అయితే శ్రీముఖి దూరమవడంతో రాహుల్ పునర్నవి, వరుణ్ సందేశ్, వితికలతో స్నేహం చేశాడు. ఫైనల్ గా వీరి గొడవకు ఎండ్ కార్డ్ పడ్డందుకు ఇద్దరి ఫ్యాన్స్ కూడా సంతోషంగా ఉన్నారు.

Share.