కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ హాన్సిక మోత్వాని తెలుగులో దేశముదురుతో తెరంగేట్రం చేసినా తమిళంలో స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ తెచ్చుకుంది. దశాబ్ధ కాలంగా తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హాన్సిక ఈమధ్య కెరియర్ లో చాలా వెనుకపడ్డది. తమిళంలో అడపాదడపా సినిమాలు చేస్తున్నా తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు అందుకోలేదు. లేటెస్ట్ గా సందీప్ కిషన్ హీరోగా తెనాలి రామకృష్ణ సినిమా చేసింది హాన్సిక.
ఈ సినిమాను జి నాగేశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇదిలాఉంటే ఈమధ్య సినిమా కెరియర్ అటుఇటుగా ఉన్న హీరోయిన్స్ అంతా వెబ్ సీరీస్ లు చేస్తున్నారు. ఇప్పుడు హాన్సిక కూడా వెబ్ సీరీస్ కు ఓకే చెప్పిందని తెలుస్తుంది. పిల్ల జమిందార్, భాగమతి సినిమాలతో దర్శకుడిగా సత్తా చాటిన అసోక్ ఈ వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారట.
అమేజాన్, నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ వెబ్ సీరీస్ లకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. హాన్సిక ఈ వెబ్ సీరీస్ లో స్పైసీ రోల్ చేస్తుందట. వెండితెర మీద అందాలతో అలరించిన హాన్సిక వెబ్ సీరీస్ లో ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో చూడాలి. తెనాలి రామకృష్ణ హిట్ అయితే తెలుగులో వరుసగా సినిమాలు చేసేందుకు తాను రెడీ అంటుంది ఈ దేశముదురు భామ.