పునర్నవితో ఛాన్స్ వస్తే వదులుకోనన్న రాహుల్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ పరిశ్రమలో ఎవరి మధ్య అయినా సరే ప్రేమాయణం ఉందనే వార్తలు రావడం ఆలస్యం అభిమానులు, సినీ జనం సోషల్ మీడియా వేదికగా వారికి సంబంధించిన ఏ వార్త వచ్చినా సరే హడావుడి చేస్తూ, సందడి చేస్తూ జనాలకు వినోదాన్ని పంచుతూ ఉంటారు. ఏదైనా ప్రముఖ రియాలిటీ షో లో ఇద్దరు కలిసి ఉంటే చాలు వారిది ప్రేమ అంటూ ప్రచారం చేసి ఆనందం పొందుతూ ఉంటారు అభిమానులు.

ఇక వారు ఏది మాట్లాడినా సరే అమితంగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ చేస్తారు. తెలుగులో అత్యంత ప్రాచుర్యం పొందిన బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ విషయంలో కూడా దాదాపుగా ఇదే జరిగింది. ఇతను బిగ్ బాస్ గెలవడానికి ప్రధాన కారణం అతనిలో ఉన్న నిజాయితీనే… ఇక ఈ షో లో అతను దాదాపుగా ప్రేమలో పడ్డాడు.

ఈ షో లో పాల్గొన్న పునర్నవి భూపాళంతో అతను ప్రేమలో పడ్డాడు. ఆమె పలు మార్లు తాను అప్పటికే ప్రేమలో ఉన్నాను అని చెప్పినా… ఆమె వెంట పడి సందడి చేసాడు రాహుల్. అయితే ఆ తర్వాత తాము కేవలం స్నేహితులమని చెప్పుకొచ్చాడు. ఇది పక్కన పెడితే… వీరిద్దరికి పెళ్లి చేస్తారని, కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారని ప్రచారం జరిగింది. ఇవన్నీ పుకార్లు మాత్రమే అని తర్వాత అర్ధమైంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీరు పున్నర్నవితో ఓ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే నటిస్తారా అని అడిగిన ప్రశ్నకు, రాహుల్ ఏ మాత్రం తడబడకుండా తప్పకుండ నటిస్తాను, అలాంటి అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా అని బదులు ఇచ్చాడు. ప్రస్తుతం అతను టీవీలకు ఇంటర్వ్యూ ఇస్తూ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మరి అతనికి ఆమెతో నటించే అవకాశం వస్తుందో రాదో ? చూడాలి.

Share.