రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో సుశాంత్ హీరోగా వచ్చిన సినిమా చిలసౌ. కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకుండా ప్రేక్షకులను మెప్పించడంలో ఈ సినిమా సక్సెస్ అయ్యింది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా రుహాని శర్మ నటించింది. మోడల్ గా యాడ్స్ లో నటిస్తున్న రుహాని శర్మని ఈ సినిమా కోసం సెలెక్ట్ చేశాడు రాహుల్ రవింద్రన్. ఆ సినిమాలో పద్ధతిగా పక్కింటి అమ్మాయిగా కనిపించిన రుహాని శర్మ ఆ తర్వాత రెచ్చిపోవడం మొదలుపెట్టింది.
ప్రస్తుతం తెలుగులో రుహాని శర్మ మరో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తుంది. నాని నిర్మాతగా చేస్తున్న హిట్ సినిమాలో రుహాని శర్మ నటిస్తుంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ఫోటో షూట్స్ చేయడం ఇప్పటి హీరోయిన్స్ కు అలవాటే. లేటెస్ట్ గా రుహాని శర్మ హాట్ పిక్ వైరల్ గా మారింది. సినిమాలో అమ్మడు సైలెంట్ రోల్ లో కనిపించగా తన హాట్ లుక్స్ తో మాత్రం అదరగొడుతుంది రుహాని శర్మ.
నాని నిర్మాణంలో తన టాలెంట్ చూపిస్తే మాత్రం తెలుగులో వరుస ఛాన్సులు అందుకునే అవకాశం ఉంది. సినిమాల్లో టాలెంట్ చూపిస్తూ బయట కూడా తన ఫోటో షూట్స్ తో దుమ్ముదులిపేస్తుంది రుహాని. మరి ఈ గ్లామర్ పిక్స్ అమ్మడికి ఏమాత్రం మైలేజ్ తెస్తుందో చూడాలి.