వ‌ర‌ల్డ్‌ ఫేమ‌స్ ల‌వ‌ర్ క‌లెక్ష‌న్ రిపోర్ట్‌…దేవ‌ర‌కొండ‌కి మ‌రో చావుదెబ్బ‌..

Google+ Pinterest LinkedIn Tumblr +

క్రేజీ స్టార్ విజ‌య్‌దేవ‌ర‌కొండ న‌టించిన తాజా చిత్రం `వ‌ర‌ల్డ్‌ఫేమ‌స్ ల‌వ‌ర్‌`. విజ‌య్‌దేవ‌ర‌కొండ సినిమా అంటే చాలు యూత్‌లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అంతేకాక విజ‌య్ సినిమాల‌కు ప్ర‌మోష‌న్స్ కూడా చాలా డిఫ‌రెంట్‌గానే ఉంటాయి. సినిమా విడుద‌ల‌కు ముందు ఆ సినిమాకి ఎంతో హైప్‌ని తీసుకువ‌స్తారు. ఇక క్రాంతి మాధ‌వ్ తెర‌కెక్కించి ఈ చిత్రం శుక్ర‌వారం విడుద‌లై డివైడ్ టాక్‌ని తెచ్చుకుంది. ఒక ర‌కంగా చెప్పాలంటే సినిమా యావ‌రేజ్ టాక్ కూడా రాన‌ట్లే. ఇక క‌లెక్ష‌న్ల విష‌యంలో విజ‌య్‌కి నిరాశ ఎదురైంది. ఈ చిత్రం పై ఎంత క్రేజ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ టాక్ తేడాగా ఉండ‌డంతో ఆ ప్ర‌భావం అంతా క‌లెక్షన్ల మీదే ప‌డింది. ఈ చిత్ర క‌లెక్ష‌న్లు దారుణంగా ప‌డిపోయాయి. ఒక‌ప్పుడు విజ‌య్ సినిమాకి తొలిరోజు 10 కోట్ల షేర్ వ‌స్తే గతేడాది విడుదలైన డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అయినా కూడా తొలిరోజే 12 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఇక నోటా సినిమా డిజాస్ట‌ర్ అయినా కూడా తొలిరోజు 8కోట్ల షేర్ వ‌చ్చింది. అంటే అది యూత్‌లో త‌న‌కున్న క్రేజ్ అని చెప్పాలి. కానీ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ మాత్రం తొలిరోజు కేవలం 5 కోట్లతో సరిపెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 5.53 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఇక దాంతోపాటు రెండో రోజు కూడా కలెక్షన్స్ అంతంత‌మాత్రంగా ఉన్నాయి. రెండ‌వ రోజు అతి దారుణంగా 2.4 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో వరల్డ్ ఫేమస్ లవర్ 8 కోట్ల షేర్ వసూలు చేసింది.

అయితే ఈ సినిమా పూర్తి బిజినెస్ వ‌చ్చేసి 20 కోట్లకు పైగానే జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే అంత దూరం విజయ్ ఈ సినిమాను తీసుకెళ్తాడా అనేది కూడా క‌ష్టం అనే చెప్పాలి. సినిమాలో కేవలం సింగరేణి ఎపిసోడ్‌కు మాత్రమే మంచి పేరొచ్చింది. అది మినహా చూడ్డానికి కూడా ఏం లేదని విమర్శకులు కూడా తేల్చడంతో వసూళ్ల పై ఆ ప్రభావం పడుతుంది. బోల్డ్ క్యారెక్ట‌ర్స్ చేసేసి ఏదో కొత్త ర‌కం క్రేజ్ తెచ్చుకోవాలంటే అస్త‌మానం ఆ మంత్రం వ‌ర్క్అవుట్ అవ‌ద‌ని మ‌రోసారి ఈచిత్రం నిరూపించింది.

క‌లెక్ష‌న్ రిపోర్ట్‌:

నైజాం: రూ. 3.51కోట్లు
సీడెడ్‌: రూ. 0.63కోట్లు
వైజాగ్‌: రూ. 0.71కోట్లు
తూర్పు: రూ. 0.47కోట్లు
ప‌శ్చిమ‌: రూ. 0.37కోట్లు
కృష్ణ‌: రూ. 0.40
గుంటూరు: రూ. 0.62కోట్లు
నెల్లూరు: రూ. 0.26కోట్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-తెలంగాణ రాష్ట్రాల మొత్తం – రూ. 6.97కోట్లు

Share.