మెగా కోడలు ఉపాసన.. అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆమె పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు ఫిట్నెస్, ఆయుర్వేదం, జంతువుల సంరక్షణ గురించి కొన్ని సూచనలు ఇస్తూ ఉంటుంది. ఇటీవల తాజాగా రెండు సింహాల ను కూడా దత్తత తీసుకుంది. వాటి కోసం ఏకంగా రెండు లక్షలు రూపాయల చెక్కును అందించింది.
అయితే తాజాగా క్రిస్మస్ వేడుకలలో ఉపాసన మెరిసిపోయింది. అందరి దృష్టి తనపై పడేలా చేసింది. ఆమె ధరించిన డ్రెస్ ఖరీదు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చూడడానికి సాధారణం గా కనిపిస్తున్న ఈ డ్రెస్ ఖరీదు మాత్రం చేరిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఈ డ్రెస్సు అక్షరాల..2.50 లక్షల రూపాయలట. ఇది విన్న నెటిజన్లు ముక్కున వేలు వేసుకున్నారు.
సాదాగా కనిపించే ఈ రచన అన్ని లక్షలు పెట్టుకొని ఉందా అంటూ మరికొంత మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం మెగాఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ విడిపోయారనే వార్తలు వినిపించాయి. క్రిస్మస్ జరిగిన వేడుకల్లో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టారు.