జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉత్తర ఆంధ్ర లో తన ప్రజా పోరాట యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ రోజు ఉదయం విశాఖ నగరం లో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. అయితే 2014 లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికిన పవన్ ఈ సారి మాత్రం టీడీపీ పై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.అనుభవం ఉందని చంద్ర బాబు కి తాను గతంలో మద్దతు పలికానని, కానీ టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిందని ఆరోపించారు జనసేనాని. ఇక ఈ సారి ఎలక్షన్స్ లో జనసేన ఒంటరి గానే పోటీ చేస్తుందని వివరించారు.
ఇక పవన్ కళ్యాణ్ టీడీపీ మరియు లోకేష్ పై ఇన్ని అవినీతి ఆరోపణలు చేసిన అవి ప్రజలకి అంతగా చేరుకోలేదనే చెప్పాలి, దానికి ప్రధాన కారణం మీడియా పవన్ కి అంతగా సపోర్ట్ చేయకపోవటమే. తెలుగు మీడియా ఛానల్స్ లో దాదాపు అన్ని అగ్ర మీడియా సంస్థలు( సాక్షి మినహా) టీడీపీ కి అనుకూలంగా పని చేసేవే అని తెలిసిందే. అయితే పవన్ రాజకీయంగా పైకి ఎదగాలంటే తనకి తప్పకుండ మీడియా సపోర్ట్ కావాల్సిందే. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి, అల్లు అరవింద్ రంగం లోకి దిగారని తెలుస్తుంది. చిరు మరియు అరవింద్ కొన్ని ప్రధాన మీడియా సంస్థలతో మాట్లాడారని, వీరు వచ్చే ఎన్నికలలో జనసేన కి పూర్తి మద్దతు పలకాలని, పవన్ కళ్యాణ్ కు తగినంత ప్రచారం కల్పించవల్సిందిగా సదరు మీడియా ఛానల్స్ ని కోరారని సమాచారం. పవన్ ను వెనక నుండి నడిపిస్తూ, ప్రోత్సహిస్తున్న చిరు, అల్లు అరవింద్ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.