మా అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత మంచు విష్ణు జెట్ స్పీడ్లో పనులు చేసుకుంటూ వెళ్తున్న విషయం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆయన ఎక్కువగా సినిమాల కంటే మా పదవి పైన ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నట్లు సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే మా ఎన్నికల సందర్భంగా పెద్దఎత్తున హామీ ఇచ్చిన మంచు విష్ణు వాటిని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటారు వస్తున్నాడు.
ఇక ప్రస్తుతం మా భవనం కట్టించి ఇస్తామని ఆయన చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ భవనం గురించి తాజాగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. అందుకే సొంతంగా భవనం కట్టించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చాడు మంచు విష్ణు. మా సభ్యులంతా కోరుకున్న విధంగానే మా భవనం గురించి ఒకటి రెండు వారాల్లో శుభవార్త తెలుపుతాను అంటూ తెలిపాడు మంచు విష్ణు. మోహన్ బాబు వారసుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. కానీ మా అధ్యక్షుడిగా ఆయన మా భవనం కట్టిస్తే మాత్రం తప్పకుండా విజయం సాధించినట్లే అంటున్నారు సినీ పెద్దలు.