మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య గొప్ప క్లాసికల్ డాన్సర్ అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.సౌజన్య శ్రీనివాస్ దాదాపు చాలా కాలం తరువాత ఆమె ‘మీనాక్షి కళ్యాణం’ అనే శాస్త్రీయ నృత్య నాటక ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రదర్శనకు పసుమర్తి రామలింగ శాస్త్రి దర్శకత్వం వహించగా..హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాయి. డిసెంబర్ 17న సాయంత్రం 6 గంటల నుంచి శిల్పకళా వేదికలో సౌజన్య ప్రదర్శనకు సంబంధించిన ఒక పోస్టర్ ను అధికారికంగా ఈరోజు ఉదయం విడుదల చేశారు.
ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి వసంత లక్ష్మీ ,తనికెళ్ల భరణి, నరసింహాచారి,చుక్కపల్లి సురేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సతీష్ చంద్ర గుప్తా వంటి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు