బిగ్ బాస్ కంటెస్టెంట్ కు అండగ ప్రభాస్ తల్లి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గత 14 వారాల నుంచి ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే మరో వారంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే విషయం తెలియనుంది. తాజాగా వచ్చిన ఓటింగ్ ప్రకారం సన్నీ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విజేతగా నిలవబోతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున ప్రసారమవుతున్నాయి.

ఊహించని రీతిలో రెబల్ స్టార్ ప్రభాస్ పెద్దమ్మ.. రెబల్ స్టార్ హీరో కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన శ్రీ రామచంద్ర ను గెలిపించాలని అందరినీ కోరుతోంది. తనకు , కృష్ణంరాజుకు శ్రీరామచంద్ర పాటలు అంటే ఎంతో ఇష్టం అని శ్యామలాదేవి వెల్లడించారు. శ్రీరామచంద్ర పాడిన భక్తి పాటలు అంటే మరింత ఎక్కువ ఇష్టమని శ్యామలాదేవి పేర్కొన్నారు.ఇండియన్ ఐడెల్ లో శ్రీరామచంద్ర గెలవడం ద్వారా ఎంతోమందికి శ్రీరామచంద్ర గర్వకారణం అయ్యారని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు. ఆమె ఒక వీడియో రూపంలో ఇవన్నీ తెలుపుతూ మా కుటుంబ సభ్యుల నుంచి శ్రీరామచంద్ర గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆల్ ద బెస్ట్ శ్రీ రామచంద్ర అంటూ తెలిపింది. ప్రస్తుతం ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share.