టాలివుడ్ లో గతంలో పోలిస్తే ఇప్పుడు చిన్న హీరోలకు మార్కెట్ పెరిగింది అనే మాట వాస్తవం. విభిన్న కథలతో రావడం, దర్శకులు కూడా జాగ్రత్తగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలు చేయడంతో హిట్ శాతం కూడా క్రమంగా పెరుగుతుంది. దీని వలన టాలివుడ్ లో చిన్న హీరోలకు మార్కెట్ కూడా బాగానే పెరుగుతూ వచ్చింది. శర్వానంద్, నానీ వంటి వారు స్టార్ హీరోలు అయ్యారు. ఇకపోతే వరుణ్ తేజ్, నిఖిల్, అడవి శేష్ లాంటి వారు మంచి కథలతో సినిమాలు చేసి హిట్ కొడుతున్నారు.
ఇందులోనే కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నారు. దీనితో వీరికి అంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రమంగా పెరుగుతూ వస్తుంది. స్టార్ హీరోలు అనే పేరు కూడా క్రమంగా తెచ్చుకునే ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నట్టే కనపడుతుంది. దీనితో ఇప్పుడు వీళ్ళ మీద అగ్ర హీరోలు దృష్టి సారించారు. వీళ్ళతో సినిమాలు చేసేందుకు గాను దృష్టి పెడుతున్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, నానీ వంటి వారు చిన్న హీరోలతో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నానీ ఈ విషయంలో విజయవంతం అయ్యారు.
మహేష్ బాబు కూడా శర్వానంద్ తో సినిమాకి ప్లాన్ చేస్తున్నారని, కథ ఆలస్యం అవుతుందని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అటు కళ్యాణ్ రామ్ కూడా ఈ విషయంలో కాస్త దూకుడుగా వెళ్తున్నారని సమాచార౦. తన తమ్ముడు ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమాను నిఖిల్ తో ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఎన్టీఆర్ నిర్మాణ సంస్థను స్థాపించే ఆలోచనలో ఉన్నాడు. మొదటి సినిమాను అఖిల్ తో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట.