ఎట్టకేలకు చిరంజీవి తన 156 వ సినిమాను ప్రకటించాడు. ప్రముఖ నిర్మాత డివీవీ దానయ్య సారధ్యంలో డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నది ఎవరో కాదు ఆయనకు వీరాభిమాని అయినటువంటి డైరెక్టర్ వెంకీ కుడుముల. చిరంజీవి తన 156వ చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వంలో చేస్తున్నానని అధికారికంగా ప్రకటించారు. నిజం చెప్పాలంటే కుర్ర హీరోలు సైతం చిరంజీవిని చూసి జంకుతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక సినిమా పూర్తి చేస్తున్నారో లేదో మరో కొత్త సినిమాను అనౌన్స్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు చిరంజీవి.
ఇక ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న ఆయన, మరో వైపు భోళా శంకర్, గాడ్ ఫాదర్ వంటి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన తాజాగా తన 156 చిత్రాన్ని కూడా చేస్తున్నట్టు ..అందులోనూ తన అభిమాని అయినటువంటి డైరెక్టర్ వెంకీ కుడుముల కు అవకాశం ఇచ్చినట్లు చిరంజీవి వెల్లడించారు. ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ బడ్జెట్ సినిమా తర్వాత దానయ్య నిర్మిస్తున్న మరో భారీ ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం. హీరోయిన్, టెక్నీషియన్స్ ఇలా అన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని వివరించారు.