చిరుతో అక్కినేని ఢీ…!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి అక్కినేని నాగార్జున మంచి స్నేహితులు. అంతే కాదు ఇద్దరు హీరోలు వ్యాపార రంగాల్లోనూ భాగస్వాములు కూడా. ఇద్దరు కలిసి ఇంతకు ముందు మా టీవీని స్థాపించారు. వీటికి తోడు అనేక వ్యాపారాల్లోనూ నాగార్జున, చిరంజీవిలు భాగస్వాములుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇద్దరి మధ్య వార్ నడుస్తుందట. ఎందులో వార్ నడుస్తుందో ఓసారి లుక్కేద్దాం.

అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు2 సినిమా ఆగస్టు9న విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. అయితే మన్మథుడు 2 సినిమాను కేవలం 40కోట్లతో నిర్మించారట. ఈ సినిమా రిలీజ్ చేసిన వెంటనే ఆగస్టు 15న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా రిలీజ్ చేయనున్నారు… ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.300కోట్ల వ్యయంతో నిర్మించారని టాక్. అంటే పెద్ద బడ్జెట్ చిత్రం సాహోతో చిన్న బడ్జెట్ చిత్రమైన మన్మథుడు 2 చిత్రం పోటీ పడుతుందన్న మాట.

ఇక అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య తన మేనమామ వెంకటేశ్తో కలిసి నటించిన సినిమా వెంకిమామ. నాగచైతన్య, వెంకటేశ్ కలిసి నటించిన వెంకిమామా బడ్జెట్ రూ.40కోట్లు. అయితే ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తుందట సినిమా యూనిట్. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా అక్టోబర్ 2న విడుదల చేసేందుకు అనధికారికంగా సన్నద్ధం అవుతున్నట్లు తెలిసింది. సైరా సినిమాను రూ.200కోట్లతో నిర్మిస్తున్నారు. సో అక్కినేని నాగ చైతన్య చిన్న చిత్రం, చిరంజీవి పెద్ద చిత్రంతో పోటీ పడుతుందటనే టాక్ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు ఇప్పటికే నాగార్జున కుటుంబం మజిలి, ఓ బేబీ రిలిజ్ అయి విజయవంతం అయ్యాయి. ఇప్పుడు నాగార్జున ప్రభాస్ తో, నాగచైతన్య చిరంజీవితో పోటీ పడుతున్నారు. ఇందులో ఎవరు విజయం సాధిస్తారో వేచిచూడాలి మరి.

Share.