తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంతటి క్రీజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి అయిన ఈ చిత్రం కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తోంది. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇక త్రివిక్రమ్ కూడా ఈ సినిమా కథను మార్చి పూర్తిస్థాయిలో మరొకసారి ప్లాన్ చేసి షూటింగ్ తీయవలసి వచ్చిందనే వార్తలు కూడా వినిపించాయి.
అయితే ఇందులో కేవలం కథలో మాత్రమే కాకుండా నటీనటులలో కూడా చాలా మార్పులు చేయవలసి వచ్చిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక విధంగా నిర్మాతకు మొదటి షెడ్యూల్ కారణంగా కొంత ఆర్థిక నష్టాన్ని కూడా కలిగించిందని చెప్పవచ్చు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాజెక్టు ఆగకూడదని వీలైనంత త్వరగా ఈ సినిమాని మొదలుపెట్టి ఐదు నెలలలోనే ప్రాజెక్టు పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లుగా సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో నే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త ప్రకారం ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో సీనియర్ సింగర్ గా పేరుపొందిన సునీత కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా మహేష్ బాబు సోదరి పాత్రలో ఆమెను ఎంపిక చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సింగర్ సునీత పలు కమర్షియల్ యాడ్ లలో కూడా నటించింది.
అంతేకాకుండా టెలివిజన్ , పలు రియాల్టీ షోలలో కూడా నటించింది సింగర్ సునీత. కానీ వెండితెరపై ఇంతవరకు అసలు కనిపించలేదు. మొదటిసారి స్క్రీన్ పై ఆమెకు నటించే అవకాశం వచ్చినప్పటికీ కూడా అందుకు ఒప్పుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు సోదరి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై స్పందించిన సునీత తాను ఈ సినిమాలో నటించడం లేదని అసలు వెండితెరపై నటించడానికి తనకు ఆసక్తి లేదు అని కూడా స్పష్టం చేసింది. ఏది ఏమైనా సునీత స్పందించడంతో ఈ వార్తలకు చెక్ పడిందని చెప్పవచ్చు.ఇకపోతే గడిచిన కొద్ది రోజుల క్రితం మహేష్ బాబు ఇంట వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కాస్త గ్యాప్ ఇచ్చిన మహేష్ బాబు తిరిగి షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.