తెలుగు సినీ ఇండస్ట్రీలో సిల్క్ స్మిత అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఏమి అసలు పేరు వడ్లపట్ల విజయలక్ష్మి. ఈమె ఏలూరు ప్రాంతానికి చెందిన అమ్మాయి. 1960 డిసెంబర్ 2 వ తేదీన జన్మించింది 4వ తరగతి వరకే చదువుకున్న ఈమె 15 ఏళ్లకే వివాహం చేసుకుంది. ఇక ఈమె భర్త అత్తమామల వేధింపులు గురి చేయడంతో ఇల్లు వదిలి పారిపోయిన విజయలక్ష్మి మద్రాస్ కు వచ్చి మొదట టచ్ అప్ ఆర్టిస్టుగా తన కెరియర్ను ప్రారంభించింది.
ఆ తర్వాత వండిచక్రం సినిమాలో తమిళ సినిమాతో సిల్క్ స్మిత ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. సిల్క్ స్మిత తమిళ ప్రేక్షకులను ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. దీంతో ఆమెను సిల్క్ స్మిత అని పిలుస్తూ ఉండేవారు. టాప్ హీరోస్ చిత్రాలలో సిల్క్ స్మిత ఆడి పాడింది. తెలుగులో పాటు తమిళ్, కన్నడ, మలయాళం వంటి చిత్రాలలో కూడా నటించింది. ఇక ఎంతోమంది ప్రేక్షకులు సైతం సిల్క్ స్మిత ఆటోగ్రాఫ్ కోసం చాలా ఆత్రుతగా ఉండేవారట. అంతేకాకుండా కొన్నిసార్లు సిల్క్ స్మిత కొరికిన యాపిల్, కిల్లి వంటివి వేలం పాటలో కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయట.
వెండితెరపై ఒక వెలుగు వెలిగిన సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకుంది. తాజాగా సిల్క్ స్మిత సూసైడ్ నోట్లో ఒక లెటర్ వైరల్ గా మారుతోంది. అందులో ఏమి రాసిందంటే.. అభాగ్యురాలు 22/9/1996.. దేవుడా నా ఏడు సంవత్సరం నుంచి నా పొట్టకి కష్టపడ్డాను.. నాకు నా వారు అంటూ ఎవరూ లేరు నేను నమ్మిన వారు నమ్మి మోసం చేశారు.. బాబు తప్ప నా మీద ఎవరు ప్రేమ చూపలేదు ఎవరికి నామీద ప్రేమ లేదు బాబు తప్పితే అందరూ నా కష్టం తిన్నవారే నా నాశనం కోరారు ఎవరికీ విశ్వాసం లేదు జీవితంలో నాకు అందరిలాగే కోరికలు ఉన్నాయి.. నా అనుకున్న వాళ్లు మనశ్శాంతి లేకుండా చేశారు నా మరణానికి కారణమయ్యారని తెలిపింది. ప్రస్తుతం ఏ లెటర్ వైరల్ గా మారుతోంది.