Shruti Hassan: ఆరెలుగా ఆల్కహాల్ కి దూరంగా శృతిహాసన్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

Shruti Hassan:టాలీవుడ్ లో హీరోయిన్ శృతిహాసన్(Shruti Hassan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్గా తన హవా మళ్లీ కొనసాగిస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోలతో కూడా నటించి మంచి విజయాలను అందుకుంటోంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి ,వాల్తేర్ వీరయ్య సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిచాయి. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Shruti Haasan biography, wiki, age, height, husband, religion, caste & more
తాజాగా శృతిహాసన్ గురించి ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. శృతిహాసన్ గురించి కొన్ని వ్యక్తిగత విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. ఒక అభిమాని మీరు మద్యం తాగుతారా అని ప్రశ్నించగా ?.. అందుకు శృతిహాసన్ ఆరేళ్లుగా ఆల్కహాల్ జోలికి వెళ్లడం లేదని సమాధానం తెలియజేసింది. అయితే గతంలో మద్యం సేవించి ఆరేళ్ల కాలం నుంచి ఆల్కహాల్ కి దూరంగా ఉన్నట్లు ఆమె మాటలు బట్టి మనకి అర్థమవుతుంది.

కానీ గత ఇంటర్వ్యూలలో ఆల్కహాల్ తక్కువ శాతం ఉండే బిర్ ను మాత్రమే తీసుకుంటానని తెలియజేసింది. ఈ రెండు కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక్కడే చిన్న గందరగోళం నెలకొంది ..మద్యం అంటే కేవలం బీరుగా భావించి అలా బదులు ఇచ్చిందా లేకపోతే ఆల్కహాల్ మానేసి ఆరేళ్లు అవుతుందా..? అన్న విషయంపై అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు.. ఇక ఎంతోమంది నటీనటులతో కూడా ఈమె ఎఫైర్ ఉన్నట్లుగా గతంలో వార్తలు వినిపించాయి.

గతంలో కూడ శృతిహాసన్ చేతిలో సిగరెట్టు ఉన్న ఫోటోలు కూడా తెగ వైరల్ గా మారాయి. ఇక ఇమ్మడి కెరియర్ సంగతి చూస్తే ఏ హీరోతో ఛాన్స్ వచ్చిన సై అంటూ చేసుకుంటూ వెళ్తోంది. అయితే అందుకు కారణం కరుణ సమయంలో ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నానంటూ తెలియజేయడం జరిగింది. అందుకే మళ్ళీ అలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఉండేందుకు శృతిహాసన్ ఇలా సినిమాలను ఓకే చేసుకుంటూ వెళ్తుందని తెలుస్తోంది

Share.