‘శైలజ రెడ్డి అల్లుడు’ ఫస్ట్ లుక్

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ శైలజ రెడ్డి అల్లుడు’. ఈ చిత్రంలో అత్తా పాత్రలో అలనాటి అందాల నటి రమ్య కృష్ణ పోషించారు. నాగ చైతన్య తొలిసారిగా అను తో మరియు రమ్య కృష్ణ గారితో కలిసి నటిస్తున్న చిత్రం శైలజ రెడ్డి అల్లుడు. ఇక ఈ రోజు చిత్ర యూనిట్ వారు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని విడుదల చేసారు.
ఇందులో అత్తా గా రమ్య కృష్ణ చాల హుందాగా కనిపించిందని చెప్పాలి. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పిడివి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, దర్శకుడిగా మారుతీ వ్యవహరిస్తున్నారు. గోపి సుందర్ ఈ చిత్రానికి స్వరాలూ సమకూరుస్తున్నారు.

Share.