శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ డేట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో నాని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కు సిద్ధంగా ఉన్నది.

అందుచేతనే ఈ చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్లను చాలా వేగవంతం గా చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ను రేపు విడుదల చేయబోతున్నట్లు గా చిత్రబృందం ఒక ఫోటో ని విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో సాయిపల్లవి,నాని కలిసి ఉన్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సినిమా కూడా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు చిత్రయూనిట్ సభ్యులు. ఇక అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Share.