యూఎస్ బాక్స్ ఆఫీస్: మ‌హేష్ బాబు V/s త్రివిక్ర‌మ్‌ సంక్రాంతి పోరు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ ఏడాది సంక్రాంతి పందెంకోళ్లుగా బాక్సాఫీస్ బరిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఒకటి మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ కాగా.. రెండోది బన్నీ ‘అల.. వైకుంఠపురములో’. ఈ నేప‌థ్యంలోనే మహేష్ బాబు వర్సెస్ అల్లు అర్జున్.. వీరిద్దరి మధ్య పోటీ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. అల్లు అర్జున్ సరసన పూజాహెగ్డే నటిస్తున్న ఈ సినిమాని ‘గీతా ఆర్ట్స్‌’ ‘హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌’ కాంబినేషన్‌ లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది.

మ‌రోవైపు.. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మహేష్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ లేడీ అమితాబ్ విజయశాంతి. సుమారు 13 ఏళ్ల తరవాత ఆమె ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలు సంక్రాంతికే పోటీ ప‌డుతుండంతో అటు అభిమానులు.. ఇటు ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే యూఎస్ సర్కిల్స్‌లో మ‌హేష్ బాబుకు అద్భుత‌మైన ఆద‌ర‌ణ పొందాడు. ఇక్క‌డ మ‌హేష్ సినిమాల‌కు మంచి రెస్పోన్స్‌, ఆదాయాన్ని పొందుతున్నాయి.

మ‌రియు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఇచ్చిన ఎఫ్ 2 చిత్రం యూఎస్‌లో 2 మిలియన్ డాలర్లు వసూలు చేసిందంటే మామూలు విష‌యం కాదు. సో.. వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. అలాగే.. త్రివిక్రమ్ సినిమాలు యూఎస్ బాక్సాఫిస్ వ‌ద్ద‌ ఏ మాత్రం తీసిపోవు. అయితే అల్లు అర్జున్ ఇటీవ‌ల మాస్ జోనర్లను ఎంచుకోవ‌డం వ‌ల్ల కాస్త వెన‌క‌ప‌డ్డాడు కానీ.. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్‌- అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న అల వైకుంఠ‌పురంలో చిత్రంపై అక్క‌డ కూడా మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన పాట‌లు అక్క‌డ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. మ‌రి సంక్రాంతి రేసులో దిగ‌బోతున్న ఈ రెండు సినిమాల్లో ఎవ‌రు పైచేయి సాధిస్తారో చూడాలి.

Share.