ఆ ఒక్క సన్నివేశం తొలగించండి: సెన్సార్‌ బోర్డు

Google+ Pinterest LinkedIn Tumblr +

“సంజు” ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన చిత్రం. బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రాజ్ కుమార్ హిరానీ ‘సంజు’ ని తెరక్కేకించారు. ఈ మూవీ లో హీరో గా ప్రముఖ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ నటించారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ మరియు ట్రైలర్ ని చిత్ర బృందం ఇటీవలే విడుదల చేసింది, అప్పటి నుండి ఈ బయోపిక్ పై బారి అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవలే జరిగిన సెన్సార్‌ షో లో సెన్సార్‌ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ ఇవ్వడానికి అంగీకరించారు. కానీ ఒకే ఒక్క సన్నివేశం మాత్రం తొలగించాలని సినిమా యూనిట్ ని కోరారట. రణ్‌బీర్‌(సంజయ్‌) జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో టాయిలెట్ పైప్‌లైన్‌ లీక్ అవుతున్న ఒక సన్నివేశం ఉంది, ఇది ట్రైలర్ లో కూడా కనిపిస్తుంది. అయితే సెన్సార్‌ సభ్యులు ఇటువంటి సన్నివేశాలు చూపిస్తే భారతీయ జైళ్ల వ్యవస్థపై తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టుగా ఉంటుందని వివరించి ఆ సన్నివేశాన్ని తొలగించామన్నారట. ‘సంజు’ ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకి రానుంది. సోనమ్ కపూర్, దియా మీర్జా, పరేశ్‌ రావల్‌, అనుష్క శర్మ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

Share.