మీడియా పై మెగా డాటర్ ఫైర్

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా డాటర్ ‘నిహారిక’ తాజా గా నటించిన చిత్రం “హ్యాపీ వెడ్డింగ్”. సుమంత్ అశ్విన్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటించారు. లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు. ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమాని యువీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ రోజు మీడియా మిత్రులు నిహారికాని తన పెళ్లి ఎప్పుడు మేడం, సోషల్ మీడియా లో మీ పెళ్లి పలానా స్టార్ హీరో తో అని వార్తలు వస్తున్నాయి మీరేమంటారు అని అడగ్గా దానికి ఫైరైనా నిహారిక ” నా పెళ్లి గురించి మీకెందుకయ్యా! నిహారిక ఎప్పుడు చేసుకుంటుంది? ఎక్కడ చేసుకుంటుంది? ఎందుకు చేసుకుంటుంది? చూస్తే షాకవుతారు! షేకవుతారు! కింద పడి లేస్తారు! ” అని సీరియస్ గ చెప్పింది.
మీకు లైక్స్, క్లిక్స్ కోసం నా పేరు ని ఫోటో ని వాడుకుంటారా అంటూ ఫైర్‌ అయిపోయారు. అయితే వెంటనే స్పందించిన మీడియా విలేకరి మేము అడిగింది ‘హ్యాపి వెడ్డింగ్‌’ మూవీ గురించి మేడమ్‌ అని చెప్పగా వెంటనే నిహారిక సారీ చెబుతూ ‘హ్యాపీ వెడ్డింగ్’ ట్రైలర్ జూన్ 30 నా విడుదలవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. హ్యాపీ వెడ్డింగ్ టీం వారు చేసిన ఈ ఫన్నీ వీడియో అందరికి నచ్చిందని చెప్పాలి.ఈ చిత్రానికి సంబంధించిన వివాహ ఆహ్వాన పత్రికను జూన్‌ 21న విడుదల చేయగా, ఈనెల 30న ట్రైలర్‌ను విడుదల చేయనున్నారని చిత్ర బృందం ఇటీవలే ప్రకటించింది.

Share.