‘బాహుబలి: ది కంక్లూజన్’ ని బీట్ చేసిన ‘సంజు’

Google+ Pinterest LinkedIn Tumblr +

‘సంజు’ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా. ఇందులో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రా పోషించగా, అనుష్క శర్మ, దియా మీర్జా, సోనమ్ కపూర్ ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించారు. రణబీర్ కపూర్ తండ్రి గా ప్రముఖ నటుడు పరేష్ రవెల్ నటించగా అతనికి తల్లిగా మనీషా కొయిరాలా నటించింది. విడుదలకు ముందు నుండే అనేకా వివాదాలకు కేంద్రబిందువైన ఈ బయోపిక్ ఎట్టకేలకు మొన్న శుక్రవారం విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. విదేశాలలో కూడా ‘సంజు’ బారి వసూళ్లతో దూసుకువెళుతోంది. దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వస్తున్నాయి.

అయితే ‘సంజు’ వసూళ్ళలో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా ‘బాహుబలి: ది కంక్లూజన్’ ని అధిగమించింది. తొలి రోజే రూ.34.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఈ సంవత్సరం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిందీ. అయితే తొలిరోజు వసూళ్ళలో మాత్రం ‘బాహుబలి: ది కంక్లూజన్’ కలెక్షన్లను సంజు అందుకోలేకపోయింది. ఈ సినిమా మూడో రోజు మాత్రం బాహుబలి ని బీట్ చేసి అరుదైన రికార్డు నెలకొల్పింది.
మూడో రోజైన ఆదివారం ‘బాహుబలి-2’రూ.46.50 కోట్లు కలెక్ట్ చేయగా…తాజాగా సంజూ రూ.46.71 కోట్ల గ్రాస్ ని వాసులు చేసి రికార్డు సృష్టించింది. ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లో మొత్తంగా రూ.120 కోట్లు కలెక్ట్ చేసిందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం.

Share.