టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు అత్యధికంగా పారితోషికాలు తీసుకుంటున్నారు. స్టార్ హీరోలకు సమానంగా వారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో సమంత, రష్మిక, తమన్నా, పూజా హెగ్డే.. వీరందరూ3 కోట్ల నుంచి 6 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారు. వీళ్ళల్లో నయనతారనే రెమ్యూనరేషన్ లో టాప్ ప్లేస్ లో ఉంది.
ఇలా కోట్లు తీసుకుంటున్న హీరోయిన్లతో సాయి పల్లవిని పోల్చితే ఆమె తీసుకునే రెమ్యూనరేషన్ చాలా తక్కువని గమనించవచ్చు. గ్లామరస్ పాత్రలో కాకుండా తన పాత్రకు కూడా సినిమాలలో విలువ ఉన్న స్టోరీలనే చూసి ఎంచుకుంటుంది ఈమె. తాజాగా ఈమె నటించిన లవ్ స్టోరీ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈమె అందుకుంటున్న రెమ్యూనరేషన్ విషయానికొస్తే.. మొదట్లో 30 లక్షలు తీసుకోగా.. ఫిదా సినిమా కి 50 లక్షలు అందుకున్నది. లవ్ స్టోరీ మూవీ కి దాదాపుగా ఈమే కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్లు సమాచారం. మిగతా హీరోయిన్లతో పోల్చుకుంటే ఈమె ఈ రెమ్యూనరేషన్ తీసుకున్నది చాలా తక్కువని చెప్పవచ్చు.