బాహుబలి ది కన్‌క్లూజన్ తరువాత, యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహించిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో. రు.350 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకు ఐదు భాషల్లో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన లభించలేదు. రు. 276 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్మగా.. రు. 210 కోట్లను మాత్రమే రాబట్టింది.
సాహో తెలుగు రాష్ట్రాల్లో రూ .80.70 కోట్లు, హిందీ వెర్షన్ రూ .76.70 కోట్లు వసూలు చేసింది. సాహో ఇండియా మొత్తంగా చూస్తే రూ .180 కోట్లు వసూలు చేసింది. ఫైనల్ బాక్సాఫీస్ రన్ పూర్తయ్యే సరికి కొనుగోలుదారులు అధిక మొత్తాలను కోల్పోయారు. శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటించింది.
ఇక సాహో వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి….
నైజాం – 28.10 Cr
సీడెడ్ – 11.90 Cr
వైజాగ్ – 10.10 Cr
గుంటూరు – 8.10 Cr
ఈస్ట్ – 7.40 Cr
వెస్ట్ – 5.70 Cr
కృష్ణా – 5.10 Cr
నెల్లూరు – 4.40 Cr
————————————
ఏపీ + తెలంగాణ = 80.70 Cr
————————————
హిందీ – 76.70 Cr
కర్నాటక – 16 Cr
తమిళనాడు – 5.20 Cr
కేరళ – 1.40 Cr
———————————
ఇండియా టోటల్ = 180 Cr
———————————
రెస్టాఫ్ వరల్డ్ – 30 Cr
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ = 210 Cr