చాణ‌క్య ప్రిమియ‌ర్ షో టాక్‌…!

Google+ Pinterest LinkedIn Tumblr +

వినోదం, ఎమోషన్స్‌, ఉత్కంఠతకు గురిచేసే అంశాలతో తెర‌కెక్కిన చిత్రం చాణ‌క్య‌. యాక్ష‌న్ హీరో గోపిచంద్ హీరోగా న‌టించిన ఈ సినిమాను త‌మిళ ద‌ర్శ‌కుడు తిరు దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అగ్ర నిర్మాత అనిల్‌ సుంకర నిర్మించారు. మెహ్రీన్ కౌర్ కథానాయికగా, బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ ఒక ముఖ్య పాత్రలో న‌టించారు. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది చాణ‌క్య‌.

చాణ‌క్య సినిమా లో యాక్షన్‌కి స్పై బ్యాక్‌డ్రాప్‌ జోడించడంతో సినిమాకి కొత్తద‌నం వచ్చింది. ఆడియెన్స్‌ బాగా కనెక్ట్ అయ్యెలా రూపొందించారు ద‌ర్శ‌కుడు తిరు. ఈ సినిమాలో గోపిచంద్‌ రా ఏజెంట్‌ అర్జున్‌గా కనిపించారు. అయితే ఇందులో గోపీచంద్ రెండు పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. ఒక‌టి అర్జున్ అనే రా ఆఫీస‌ర్‌గా, మ‌రొక‌టి రామ‌కృష్ణ అనే బ్యాంక్ ఉద్యోగి పాత్ర‌లో.. అంటే రా ఆఫీస‌ర్‌గా ప‌నిచేసే గోపీచంద్ తాను ఓ ఏజెంట్ అని తెలియ‌కుండా ఉండేందుకు ఓ బ్యాంక్ ఉద్యోగి అవ‌తారం ఎత్తుతాడు..

అయితే సినిమాలో గోపీచంద్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. మెహ‌రీన్ క‌థ‌నాయిక‌గా త‌న అంద‌చందాల‌ను, త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింద‌నే టాక్ వినిపిస్తుంది. సినిమా మ‌ద్య‌మ‌ద్య‌లో అలీతో వ‌చ్చే కామెడీ కూడా బాగానే ఉంద‌ని ప్రిమియ‌ర్ షో టాక్ . మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా చిత్రానికి ఈ చిత్రం డిఫ‌రెంట్ క‌థాంశంతో తెర‌కెక్కంది. సైరా చిత్రానికి ఈ చిత్రం పోటీ కాన‌ప్ప‌టికి కొత్త‌ద‌నం కోరుకునే ప్రేక్ష‌కుల‌కు సైరా, చాణ‌క్య రెండు రెండే అనేలా ఉంద‌నే టాక్ వినిపిస్తుంది.

Share.