సాహూ.. జులాయ్ సినిమాను కాపీ కొట్టారా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

స్టైయిష్స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా గుర్తుందా… అదేనండీ జులాయి సినిమా. ఈ సినిమా కథను పోలినట్లే ఉంటే కథతోనే ఇప్పుడు వస్తున్న సినిమా అచ్చు గుద్దినట్లు ఉంటుందట… కాకుంటే.. ఈ సినిమా కథ, ఆసినిమా కథ ఒక్కటే.. యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కించే క్రమంలో కొన్ని మార్పులు చేర్పులతో సినిమా తీసి దీనికి రంగులు అద్దినట్లు ఇప్పుడు సిని ప్రపంచంలో కోడై కూస్తుంది. ఇంతకు జులాయి సినిమాకు కాపీగా అనుకుంటున్న సినిమా ఏంటై ఉంటుంది… అనుకుంటున్నారా… ఇంకేముందండి…

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా సాహో. ఈ సినిమా ఇప్పుడు కొన్ని గంటల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఓ కొత్త ట్విస్ట్ సోషల్ మీడియాలో హల్ఛల్ చేస్తోంది. ఇంతకు సాహో సినిమా కథ ఏమైనా కొత్తదా… అంటే టీజర్, ట్రైలర్, చిత్రంపై వస్తున్న ఊహగానాలకు ప్రకారం జులాయి సినిమాకు అచ్చుగుద్దినట్లు పోలికలు ఉన్నాయట… ఇంతకు జులాయికి, సాహోకు ఉన్న పొలికలు ఏంటంటే…

జులాయి సినిమాలో 1500కోట్లను ఓ ముఠా బ్యాంక్కు కన్నం వేసి కొల్లగొడుతుంది. ఈ 1500కోట్ల కోసం హీరో స్టైలిష్స్టార్ అల్లు అర్జున్ ఓ పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఉంటూ వాటిని కనిపెట్టడం సినిమా అసలు కథ.. ఇక్కడ సాహో సినిమా కూడా 2000కోట్లను కొల్లగొట్టడమే కథగా ఉందట. ఈ 2000కోట్ల బ్యాంక్ రాబరీ చేసిన వారి అంతు తేల్చి వాటిని కనిపెట్టె పనిలో జరిగే సంఘటనలే ఈసినిమా కథట. సో జులాయి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తనదైన స్టైల్లో తెరకెక్కిస్తే… సుజిత్ సాహో సినిమాను తనమార్కుతో తెరకెక్కించాడట. కాకుంటే అందులో ఇందులో కేవలం బ్యాంక్ను కొల్లగొట్టిన వారి పనిపట్టడమే కథట.

Share.