‘ ఆర్ఎక్స్ 100 ‘ ట్రైలర్

Google+ Pinterest LinkedIn Tumblr +

కార్తీక్ గుమ్మకొండ, పాయల్ రాజపుత్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ ఆర్ ఎక్స్ 100 ‘ ట్రైలర్ ని చిత్ర బృందం ఈ రోజు ఉదయం విడుదల చేసారు. అజయ్ భూపతి తొలిసారిగా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ని బట్టి ఇది ఒక గ్రామీణ ప్రాంతం లో నడిచే రొమాంటిక్ ప్రేమ కథ చిత్రం అని తెలుస్తుంది. హీరో ఎంతో ప్రేమ గా చూసుకునే బైక్ ని విలన్ కాల్చేయటంతో సినిమా అసలు కథ మొదలవుతుంది. హై లెవెల్ యాక్షన్ సీన్స్ ని హీరో బాగానే నటించాడని ట్రైలర్ ద్వారా చెప్పవచ్చు.

మెయిన్ విలన్ గా రావు రమేష్ మరో ముఖ్య మైన పాత్రలో నటించారు. చాల రోజుల తరువాత సింధూర పువ్వు ఫేమ్ రాంకీ తెలుగు లో ఒక ప్రముఖ పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. పల్లెటూరి నేపధ్యంతో లో నడిచే ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. ఈ నెల 12 వ తేదీన ‘ ఆర్ ఎక్స్ 100 ‘ ని విడుదల చేయటానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

Share.