బాహుబలి 2 ని బీట్ చేసిన ఆర్ ఎక్స్ 100

Google+ Pinterest LinkedIn Tumblr +

‘బాహుబలి’ తెలుగు సినిమా సత్తా ఏమిటో యావత్ భారత్ దేశానికి చాటి చెప్పిన చిత్రం. ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునేలా చేసిన సినిమా బహుబాలి. ఈ అద్భుత దృశ్య కావ్యాన్ని రాజమౌళి తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2000 వేల కోట్లు (రెండు భాగాలు కలిపి) వాసులు చేసింది మన బాహుబలి, ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ కూడా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్ట లేదు.
అయితే ఇంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న బాహుబలి సినిమా వసూళ్ళని ఒక చిన్న సినిమా అధిగమిస్తే ఎలా ఉంటాదో చేసి చూపింది ‘ఆర్ ఎక్స్ 100 ‘. ఇటీవలే విడుదలైన ఆర్ ఎక్స్ 100 రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. అయితే ఈ క్రమంలో ఆర్ ఎక్స్ 100 చిత్రం ‘బాహుబలి 2 ‘ చిత్రం నెలకొల్పిన ఒక రికార్డు ని బీట్ చేసింది.
అదేంటో చూద్దాం… హైదరాబాద్ లోని ఆర్ టి సి క్రాస్ రోడ్స్ లో ఉన్న దేవి 70 ఎం ఎం థియేటర్ లో ఫస్ట్ వీక్ గ్రాస్ లో ‘ఆర్ ఎక్స్ 100 ‘ రూ. 29,32,867 వాసులు చేయగా, బాహుబలి 2 రూ.28,82,370 వాసులు చేసి రెండో స్థానం లో సరి పెట్టుకుంది. ఇలా ఇప్పటి వరకు బాహుబలి పేరిట ఉన్న ఈ రికార్డు ని తాజాగా విడుదలైన ఆర్ ఎక్స్ 100 బ్రేక్ చేసి ఇండస్ట్రీ వర్గాలని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.

Share.