నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం `రూలర్`. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించగా, సీ కళ్యాణ్ సినిమాని నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్స్ సినిమా భారీ అంచనాలు తెచ్చిపెట్టాయి. ఇక పక్కా మాస్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కనుంది. ఇందులో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, పక్కా బిజినెస్ మెన్ గా కనిపించబోతున్నారు. అయితే రెండు పాత్రలు దేనికవే ఆకట్టుకునే విధంగా ఉంటాయని తెలుస్తోంది.
బాలకృష్ణ సరసన వేదిక, సోనాలి చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు. చిరంతన్ భట్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20 న విడుదల చేయనున్నారు. గతంలో బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్ లో వచ్చిన జై సింహా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి లాభాల్ని అందించింది. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1000 థియేటర్లలో తెరపైకి రానుంది. కాగా, బాలయ్య బాబు కెరీర్ లో 105వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని U/A సర్టిఫికెట్ పొందింది.
ఈ సినిమా 2 గంటల 30 నిమిషాల నిడివితో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాను రూ.25 కోట్ల బడ్జెట్తో రూపొందించినట్టు తెలుస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయని తెలిసింది. మొత్తంగా చూస్తే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 24 కోట్ల మేర జరిగిందని రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. ఈ నెంబర్స్ పట్ల చిత్రనిర్మాత చాలా సంతృప్తిగా ఉన్నారని సమాచారం.
`రూలర్` ప్రీ- రిలీజ్ బిజినెస్ ఏరియా వైజ్ చూస్తే.. (కోట్లలో)
నైజాంలో- 5 కోట్లు
సీడెడ్లో- 5.50 కోట్లు
నెల్లూరు- 1.28 కోట్లు
గుంటూరు- 2.70 కోట్లు
కృష్ణా- 1.60 కోట్లు
వెస్ట్ గోదావరి- 1.45 కోట్లు
ఈస్ట్ గోదావరి- 1.60 కోట్లు
ఉత్తరాంధ్ర- 2. 50 కోట్లు
————————————————————
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం- 21 కోట్లు
—————————————————————
రెస్ట్ ఆఫ్ ఇండియా- 1.50 కోట్లు
వరల్డ్ వైడ్- 24.13 కోట్లు