నిన్నటి రాత్రి నుంచి పాన్ ఇండియా మూవీ అయిన మల్టీస్టారర్ చిత్రం..RRR ఈ సినిమా గురించే పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. 2 రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ త్వరలోనే విడుదల అవుతుందని రాజమౌళి స్వయంగా తెలియజేశారు. కానీ నిన్నటి రోజున ఈ సినిమా ట్రైలర్ వాయిదాపడుతోంది అన్నట్లుగా ఒక టాక్ వైరల్ గా మారుతోంది
.
ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నట్లుగా తెలుపగా.. కానీ దీనిపై RRR చిత్ర బృందం మాత్రం అధికారికంగా తెలపడం జరిగింది.. కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ చిత్రం ట్రైలర్ ని డిసెంబర్ 3న విడుదల చేయడం లేదని.. సరికొత్త రిలీజ్ డేట్ తో తాము త్వరలో ఒక అనౌన్స్మెంట్ చేస్తామని ఈ పోస్టు ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఈ భారీ సినిమాలో మెగా స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. అలాగే అజయ్ దేవగన్, ఆలియా భట్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.
Due to unforeseen circumstances we aren’t releasing the #RRRTrailer on December 3rd.
We will announce the new date very soon.
— RRR Movie (@RRRMovie) December 1, 2021