దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుని వచ్చే ఏడాది విడుదలకు సిద్దమవుతుంది. చారిత్రాత్మక ఫ్రిక్షన్ తో వస్తున్న ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు. హీరోలు ఇద్దరు కూడా మరో సినిమా మీద దృష్టి పెట్టకుండా ఈ సినిమాను పూర్తి చేయడానికి తీవ్రంగానే శ్రమిస్తున్నారు. రాజమౌళి కూడా ఈ సినిమా విషయంలో,
ఎక్కడా కూడా రాజీ పడకుండా ప్రతీ సీన్ ని జాగ్రత్తగా చిత్రీకరిస్తున్నారు. ఒక సీన్ సరిగా రాకపోతే మరో సారి షూట్ చేయడమే గాని రాజి పడటం లేదట జక్కన్న. ఇదే సమయంలో రాజమౌళి హీరోలు ఇద్దరికీ కూడా కొన్ని షరతులు విధించారని సమాచారం. సంక్రాంతి తర్వాత షూటింగ్ సీరియస్ గా ఉంటుందని, హైదరాబాద్ వెళ్లోద్దని చెప్పెసారట. అవసరం అయితే కుటుంబాన్ని ఇక్కడికే తెచ్చుకోవాలి గాని ఇక్కడి నుంచి వెళ్లోద్దని, రాత్రి సమయాల్లో షూటింగ్ ఎక్కువగా ఉంటుందని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని,
ఇతర సినిమాల ప్రమోషన్లలో కూడా పాల్గొనే ప్రయత్నం చేయవద్దని చెప్పెసారట. కీలక సన్నివేశాల కోసం రాత్రి సమయంలో చితీకరణ ఉంటుంది కాబట్టి చిత్ర యూనిట్ కూడా అందుకు సిద్దంగా ఉండాలని, ఎక్కడికి వెళ్లోద్దని చెప్పెసారట. ఈ సినిమా లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీ౦ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే వీళ్ళు ఇద్దరు వేరే కథలు దర్శకులు వినిపించినా సరే ఈ సినిమా పూర్తి అయ్యే వరకు లేదని తర్వాత చూద్దామని చెప్పెసారట.