అఖండ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఆరు హీరో బాలకృష్ణ. ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఇక మరో పక్క కూడా ఆహలో ఆన్ స్టాపబుల్ షోలో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇది టిఆర్పి రేటింగ్ లో బాగానే దూసుకుపోతోంది. ఇక ఇప్పటి వరకు మోహన్ బాబు, బ్రహ్మానందం, రాజమౌళి వంటి తారలు అశోక్ అతిథులుగా రావడం జరిగింది.
త్వరలోనే ఈ షోలో మహేష్ బాబు కూడా కనిపించబోతున్నారని వార్త కూడా బాగా ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ ఈ షో కి గెస్ట్ గా రాబోతున్నట్లు గా తెలుస్తోంది. ఇక రవితేజ తో పాటుగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా రాబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక అప్పట్లో రవితేజ బాలకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపించాయి. రవితేజ మెగా ఫ్యామిలీకి బాగా క్లోజ్ అని అందుకే బాలకృష్ణ తో విభేదాలు ఉన్నాయని రకరకాలుగా ప్రచారం జరిగింది.
అందుకు తగ్గట్టుగానే వీరిద్దరు ఎప్పుడూ కూడా మాట్లాడుకోవడం జరగలేదు. ఇప్పుడు ఈ రూమర్ల నీటికి చెక్ పెట్టే విధంగా ఈ షోకి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు రవితేజ.