రానా బర్తడే స్పెషల్.. భీమ్లానాయక్ నుంచి భారీ అప్డేట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పవర్ స్టార్ పవన్ కళ్యణ్ దగ్గుబాటి రానా కలిసి మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాని డైరెక్టర్ సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో డానియల్ శేఖర్ గా రానా ఫుల్ యాటిట్యూడ్ రోల్ లో నటిస్తున్నారు. ఈ రోజున రానా బర్త్ డే కానుకగా ఒక క్రేజీ అప్ డేట్ ని చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయబోతున్నారని వార్త వినిపిస్తోంది. ఇక అందుకు సంబంధించి ట్విట్టర్ ద్వారా ఒక పోస్టును కూడా చేశారు.

ఒక మాస్ పోస్టర్ తో రానా కి బర్త్ డే విషెస్ చెబుతూ ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు స్వాగ్ అఫ్ డానియల్ ని రిలీజ్ చేయనున్నట్లు గా చిత్ర యూనిట్ సభ్యులు కన్ఫర్మ్ చేశారు.మరి ఈ స్పెషల్ టీజర్ ఎలా ఉండబోతోందో అంటూ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ కాస్తా వైరల్ గా మారుతోంది. ఈ సినిమాని జనవరి 12 వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.

Share.