రకుల్ హంగామా మొదలైందా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్, అయితే మెల్లిగా తన పరిస్థితి మారిపోయింది. కొత్త తరం నటీమణుల రాకతో ఆమెకి కొంత వరకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయని చెప్పొచ్చు. అటు తర్వాత రకుల్ కోలీవుడ్ లోకి వెళ్లిపోయింది. అక్కడ కూడా సరైన అవకాశాలు లేకపోవటం తో బాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకుందాం అనుకుంది. ఆ ప్రయత్నంలోనే సిద్దార్థ్ తో ఒక సినిమాలో నటించిన అది తనకి పెద్దగా ఆఫర్స్ ని తెచ్చి పెట్ట లేకపోయింది.
ఇక ఇప్పుడు తాజాగా వెంకీ మామ సినిమాలో నాగ చైతన్య సరసన నటిస్తుంది. గతంలో వీరిద్దరూ రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమాలో జోడిగా నటించారు. ఇక ఇప్పుడు ఈ బారి మల్టీస్టారర్ లో అవకాశం దక్కించుకుంది ఈ పొడుగు కాళ్ళ సుందరి. దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్, బోయపాటి సినిమాలో కూడా రకుల్ ఒక ఐటెం సాంగ్ చేస్తుందని టాక్. అంతే కాకుండా తెలుగు ప్రేక్షకులు ఎంత గానో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా రకుల్ ఒక ముఖ్య పాత్ర చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇలా వరుస అవకాశాలతో రకుల్ దూసుకువెళ్తుండటం తో తన అభిమానులు ఆనందం తో ఉన్నారు.

Share.