కత్రినా కైఫ్ పరువు తీసిన ఫ్యాన్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కి ఈ రోజు కెనడా లో అభిమానుల నుండి అనుకోని ఒక చేదు అనుభవం ఎదురైంది.
‘దబాంగ్ టూర్’ లో భాగంగా షో ముగిసిన తర్వాత వెళ్లిపోతున్నా కత్రినా కైఫ్ ని కొంత మంది అభిమానులు సెల్ఫీ కోసం
అడిగారు. అప్పటికే అలిసిపోయిన కత్రినా కారు వైపు వెళ్లిపోతుండగా అక్కడ ఉన్న వారు ‘ మాకు నీతో ఫోటో’ వద్దని అరిచారు, ఇది విన్న కత్రినా వారి వద్దకు వచ్చి షో తర్వాత మేము చాల అలసిపోతాం, మీరు ఇది తెలుసుకోవాలి అని మర్యాదగా చెప్పారు కత్రినా. అప్పుడు ఆ అభిమాని మీరు గొప్ప నటి అయిండొచ్చు కానీ మీకోసం వచ్చినా అభిమానులతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోండి అని చెప్పింది. కత్రినా అన్న మాటలతో కోపగించిన అభిమాని మేము వచ్చింది ‘సల్మాన్ ఖాన్ కోసమని..మీకోసం కాదని అరిచారు’
దీంతో ఆగ్రహించిన కత్రినా ఏమి మాట్లాకుండా అక్కడ ఉన్న వారితో ఫోటోలు దిగి వెళ్లిపోయారు. ఇదంతా గమనించిన ఒక వ్యక్తి జరిగిన దాన్ని వీడియో తీసి షేర్ చేయగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తుంది.
https://youtu.be/Y0G28Nyr8YM

Share.