ద‌ర్బార్ హిట్ అయినా బయ్యర్లకి నష్టాలే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

రజిని సినిమా అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే చాలు… స్కూల్స్, కాలేజీలు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్ని పక్కన పెట్టి వెళ్తూ ఉంటారు. ఆయన సినిమాను మొదటి రోజు చూడటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తెలుగు హీరోలకు కూడా ఆ స్థాయి క్రేజ్ ఉండదు. ఒకరకంగా చెప్పాలి అంటే తెలుగులో కూడా రజిని హవా నడుస్తుంది. అందుకే ఆయన సినిమా హక్కుల కోసం ఇక్కడి నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

తెలుగులో దాదాపు అందరు హీరోల అభిమానులు రజని కాంత్ కి అభిమానులే కావడం విశేషం. దీనితో ఆయన సినిమాలకు ఆ స్థాయి క్రేజ్ ఉంటుంది. అయితే కబాలి నుంచి ఆ క్రేజ్ దారుణంగా పడిపోయింది అంటున్నారు పరిశీలకులు. కబాలి సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత వచ్చిన ఒక్క సినిమా కూడా యావరేజ్ టాక్ కూడా తెచ్చుకోలేదు. దీనితో ఆయన సినిమా హక్కులు కొన్న నిర్మాతలకు ఊహించని షాక్ తగిలింది.

దీనితో ఇప్పుడు రజని సినిమా విడుదల అవుతుంది అంటే కొనుగోలు చేయడానికి నిర్మాతలు ముందుకి రాలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆయన మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ అనే సినిమా వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ అభిమానుల్లో భారీ క్రేజ్ తీసుకొచ్చింది. అయినా సరే… ఈ సినిమా విజయం సాధిస్తుంది అనే నమ్మకం మాత్రం అభిమానుల్లో కలగడం లేదు. దీనితో రజని పని తెలుగులో అయిపోయిందని ఆయన టైం అయిపోయింది అంటూ సోషల్ మీడియాలో పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Share.