రాధే శ్యామ్ నుంచి బిగ్ అప్డేట్:మరొక అద్భుతమైన పాట రిలీజ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా , పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిన, టైటానిక్ సినిమా రేంజ్ లో ఒక ప్రేమకథ పండించడానికి సిద్ధంగా ఉన్నాడు రాధాకృష్ణ.. సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ప్రముఖ దర్శకుడు రాధాకృష్ణ. ఈ సినిమాకు సంబంధించిన పాటలు , టీజర్లు విడుదలయి ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా నుండి తాజాగా “సోచ్ లియా” అనే పాటను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. ఈ సినిమాకి సంగీతాన్ని సంగీత దర్శకుడు మిధున్ అందిస్తున్నారు. ఈ పాటను బాలీవుడ్ ఫేమస్ సింగర్ అయిన అరిజిత్ సింగ్ పాడడం జరిగింది. యు.వి.క్రియేషన్స్ మరియు టి సిరీస్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాపై అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు.

Share.