పుష్ప టీమ్ మెంబర్స్ కు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన బన్నీ..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

పుష్ప ది రైజ్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా సమంత ఐటమ్ సాంగ్ లో నటిస్తోంది.. ఇక విలన్ పాత్రలో అనసూయ, కామెడీ స్టార్ సునీల్, బాలీవుడ్ స్టార్ హీరో ఫహాధ్ ఫాజిల్ వంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం అధికారికంగా పూర్తి చేసుకోగా.. టీమ్ మెంబర్స్ అందరికీ అల్లుఅర్జున్ అదిరిపోయే పార్టీ ఇచ్చాడు.

అంతే కాదు ఈ సినిమా కోసం పనిచేసిన కొంతమంది కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. పుష్ప సినిమా కోసం ప్రత్యేకం గా పనిచేసిన 12మందికి ఒక్కొక్కరికి పది గ్రాముల చొప్పున బంగారు ఉంగరాలు బహుమతిగా ఇవ్వడం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లతో పాటు మరికొంత మంది ఈ లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం. సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అదిరిపోయే ట్రీట్ ఇచ్చి అందరిని ఖుషీ చేశాడు అల్లు అర్జున్. ఇకపోతే పుష్ప పార్ట్ వన్ కోసం బంగారు ఉంగరాలు బహుమతిగా ఇచ్చిన అల్లు అర్జున్ , మరి పుష్ప పార్ట్ 2 కోసం ఎలాంటి బహుమతులు ఇచ్చి సర్ప్రైస్ చేస్తాడో వేచి చూడాలి.

Share.