లాలా భీమ్లా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసినా చిట్టి.. వీడియో వైరల్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

జాతి రత్నాలు సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా.. అయితే ఈమె అధిక పొడవు ఉన్న కారణంగా సినిమాలలో అవకాశాలు పూర్తిగా తగ్గి పోయాయి అని చెప్పవచ్చు. ఇక అందుకే తన పాపులారిటీని సంపాదించుకోవడం కోసం సినిమాలలో బాగా వైరల్ అవుతున్న పాటలకు స్టెప్పులేస్తూ అందరి దృష్టిలో పడటానికి ప్రయత్నం చేస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా లో వచ్చిన లాలా భీమ్లా అనే టైటిల్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది చిట్టి.

వీడియోలో ఫరియా బ్లాక్ వేర్ లో తన డ్యాన్స్ పాట్నర్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులేసింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య ఎక్కువగా కొన్ని టైటిల్ సాంగ్ లకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ దుమ్ముదులిపేసింది. ఈ క్రమంలోనే ఈమెకు అభిమానుల ఫాలోయింగ్ కూడా ఎక్కువ అవుతుందని చెప్పవచ్చు.

Share.