పుష్ప రెండు రోజుల్లో 100 కోట్లు కలెక్షన్..ఇందులో నిజమెంత..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కించిన చిత్రం పుష్ప. ఇక ఇందులో కథానాయికగా రష్మిక నటించింది. ఇక ఎన్నో భారీ అంచనాల మధ్య డిసెంబర్ 17న పాన్ ఇండియన్ మూవీ లెవల్లో ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది. అయితే ఇండియా మొత్తం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది ముందుకు దూసుకు వెళుతోంది అన్నట్లుగా సమాచారం. అయితే రెండు రోజుల కలెక్షన్లు కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది ఇప్పుడు వాటి గురించి చూద్దాం.

పుష్ప నిన్న ఒక్కరోజే ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సమాచారం. ఇక రెండో రోజు ఏకంగా 100 కోట్ల రూపాయల మార్కు ని దాటేసిన ట్లుగా చిత్ర మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 116 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు గా తెలియజేశారు. దీన్నిబట్టి బాక్సాఫీస్ దగ్గర పుష్ప ఏ విధంగా తన మార్కు సాధించిందో చెప్పవచ్చని ఆయన అభిమానులు ఆలోచిస్తున్నారు. మరి ఈ సినిమాకి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు అని చెప్పవచ్చు. మరి ఏకంగా ఈ సినిమా అన్ని కోట్లు అంటే ఆశ్చర్య పోవాల్సిందే అంటూ నెటిజన్లు భావిస్తున్నారు.

Share.