పుష్ప సినిమా టికెట్ల పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రాహుల్..?

Google+ Pinterest LinkedIn Tumblr +

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఇందులో కథానాయకిగా.. రష్మిక నటించింది. ఇక ఈ సినిమా ఈ రోజున బ్రహ్మాండంగా విడుదలైంది. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించారు సుకుమార్. అలా వైకుంఠపురం 20 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా టికెట్లపై హీరో రాహుల్ కొన్ని విషయాలు తెలియజేశారు. టికెట్ ఆన్లైన్ లో పెట్టే కొద్దిసేపటికే టికెట్స్ భారీగా అమ్ముడుపోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా నటుడు రాహుల్ రవీందర్ సోషల్ మీడియా వేదికగా పుష్ప సినిమా టికెట్స్ కి సంబంధించి, పలు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. పుష్ప సినిమా టికెట్లు అడిగే వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ కి సమాధానం ఇవ్వడంతోనే తన సగం రోజు గడిచిపోయింది అని తెలియజేశారు. హైదరాబాదులో ఒక్కటి కూడా అందుబాటులో లేదని తిరిగి తనే టికెట్స్ అడిగిన ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక పెద్ద చిత్రంతో మళ్లీ సమయం ఎంతో ఎగ్జైటింగ్గా నడుస్తోందని తెలియజేశారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నానని తెలియజేశారు.

Share.