అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఇక ఈ సినిమాలో కథానాయికగా రష్మిక నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లో చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక రేపటి రోజున ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కు సిద్ధం అయ్యింది. ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ఆటు అభిమానుల్లోనూ, సినీ ప్రముఖులు ఈ సినిమాపై మంచి నమ్మకాన్ని పెట్టుకున్నారు.
తాజాగా ఈ సినిమా విడుదల అవుతున్న సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన సోనూసూద్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా బ్రదర్ అంటూ అల్లు అర్జున్ కి తెలియజేశారు. ఈ సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నాను అన్నట్లుగా తెలిపారు. పుష్ప సక్సెస్ పార్టీకి అందరూ సిద్ధంగా ఉండండి అంటూ తన మనసులో మాటని తెలియజేశాడు సోనుసూద్. ఏది ఏమైనా సోనుసూద్ ఇలా మాట్లాడటం వల్ల ఈ సినిమా మరింత హైప్ అనిపించింది అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా ఇప్పుడు ఎంత వరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే కొన్ని గంటలు ఆగితే తెలుస్తుంది.
Wishing u loads of success for your film #pushpahindi my brother. Can't wait to watch this one. Get ready for the success party. @iamRashmika @aryasukku @ThisIsDSP ❣️ https://t.co/yFixrrzMJA
— sonu sood (@SonuSood) December 16, 2021