స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, గ్లామరస్ హీరోయిన్ రష్మిక మందన్నా హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా “పుష్ప” ది రైజ్. ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ అయిన సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. రేపు అంటే డిసెంబర్ 17న ఏడు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
అయితే రేపు పుష్ప సినిమా రిలీజ్ అనగా ఈ మూవీకి ఒక సమస్య ఎదురైంది. కర్ణాటకలో ఈ సినిమాను బాయ్ కాట్ చేస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు కర్ణాటక ప్రజలు.ఎందుకంటే కర్ణాటకలో కన్నడ కంటే తెలుగు వెర్షన్‌కే ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చారని కన్నడ వెర్షన్ కు కేటాయించలేదని మండిపడుతున్నారు.ఒకవేళ కర్ణాటకలో సినిమా రిలీజ్ చేయాలనుకుంటే కన్నడలోనే రిలీజ్ చేయాలని, లేదంటే సినిమాను బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #BoycottPushpaInKarnataka అనే హ్యాష్‌ట్యాగ్ ను కన్నడ ప్రజలు ట్రెండ్ చేస్తున్నారు.