కన్నడ పవర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇటీవలే మరణించిన విషయం అందరికి తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటని మిగిల్చింది. ఆయన అకాల మరణంతో సినీ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు, అభిమానులు,కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇప్పటికీ పునీత్ లేరు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.
పునీత్ మరణం తరువాత అతని గొప్పతనం గురించి అందరికి తెలిసింది. అతను చేసిన మంచి పనులు, ఎన్నో సామాజిక కార్యక్రమాలు, దానధర్మాలు ఇలా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు వెలుగులోకి వచ్చాయి . పునీత్ చేస్తున్న ఆ కార్యక్రమాలు ఆగిపోకుండా ఉండటానికి ముందుగానే ఐదు కోట్ల రూపాయలు డిపాజిట్ చేసిన గొప్ప వ్యక్తి పునీత్ రాజ్ కుమార్. అలాంటి గొప్ప వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని మైసూర్ కు చెందిన ఒక అభిమాని పునీత్ కి నివాళులు అర్పిస్తూ తిరుమల కొండకు పాదయాత్ర ప్రారంభించాడు. మైసూరులోని అగ్రహారకు చెందిన మసాజ్ సందీప్ పునీత్ అంటే వీరాభిమానం. దీనితో అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఈనెల 19 నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.