సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మించారు. `చిత్రలహరి`తో డీసెంట్ హిట్ అందుకొని ఫామ్‌లోకి వచ్చారు. ఆ సినిమా తరవాత ‘ప్రతిరోజూ పండగే’ అని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఎంపిక చేసుకున్నారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక భారీ అంచనాల నడుమ డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలయింది. ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా మారుతి తెరకెక్కించిన ఈ చిత్రానికి రానురాను వసూళ్లు ఇంకా పెరుగుతాయని ఆశిస్తున్నారు దర్శక నిర్మాతలు. అలాగే యూత్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుండడం, థియెటట్ర్స్ లో నవ్వులు ఎఎక్కువగా వినిపిస్తుండడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ స్ట్రాంగ్ గా వెళ్తోంది. ఫస్ట్ వీకెండ్ కూడా ఈ ‘ప్రతిరోజూ పండగే’కి అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి.
సుమారు 18 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకి మొదటి మూడు రోజుల్లో 9.1 కోట్ల షేర్ సాధించి సూపర్బ్ అనిపించుకుంది.అలాగే వీక్ డే అయిన సోమవారం కూడా 1.68 కోట్ల షేర్ తో సూపర్బ్ అనిపించుకుంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్లో మరో డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది.ఇక క్రిస్మస్ హాలీవుడ్ కలిసిరావడంతో వీకెండ్ అయ్యేనాటికి వసూళ్లు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నారు చిత్ర యూనిట్.
‘ప్రతిరోజూ పండగే’ 4 డేస్ ఆంధ్ర- తెలంగాణ కలెక్షన్స్:
నైజాం- 4.63 కోట్లు
సీడెడ్- 1.33 కోట్లు
గుంటూరు- 74.5 లక్షలు
ఉత్తరాంధ్ర- 1.6 కోట్లు
తూర్పు గోదావరి- 78 లక్షలు
పశ్చిమ గోదావరి- 60.5 లక్షలు
కృష్ణా- 73 లక్షలు
నెల్లూరు- 38 లక్షలు
———————————————–
4 డేస్ మొత్తం షేర్- 10.8 కోట్లు
————————————————
కర్ణాటక + ఇండియా- 0.80 కోట్లు
ఓవర్సీస్- 1.80 కోట్లు
—————————————————–
వరల్డ్ వైడ్ 4 డేస్ కలెక్షన్స్- 12.68 కోట్లు
——————————————————