మెగా మెనల్లుడు, సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రానికి మారుతి దర్శకుడు. ‘చిత్రలహరి’తో డీసెంట్ హిట్ అందుకొని ఫామ్‌లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే అంటూ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రివ్యూలు యావరేజ్ గానే ఉన్నా డీసెంట్ మౌత్ టాక్ తో ప్రతిరోజూ పండగే కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక నిన్న క్రిస్మస్ సందర్భంగా సెలవు కావడంతో ఈ చిత్రం ఆ అడ్వాంటేజ్ ను ఫుల్ గా క్యాష్ చేసుకుంది. ఆరో రోజు కూడా మొదటి రోజుకు వచ్చినట్లుగా కలెక్షన్స్ రావడంతో చాలా చోట్ల ప్రతిరోజూ పండగే బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. గ్రామీణ నేపథ్యం, కుటుంబ బంధాలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఈ చిత్రంలో మారుతీ తనదైన శైలిలో చూపించాడు.
ఇక 6 వరోజు ఈ సినిమా సుమారు 2.9 కోట్ల షేర్ ని సాధించింది. క్రిస్మస్ హాలిడే అవడం, థియేటర్స్ లో ఉన్న కాస్త పెద్ద సినిమా ఇదే అవ్వడంతో అల్ ఓవర్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఆంధ్ర – తెలంగాణలో సుమారు 16 కోట్లకి అమ్ముడు పోయిన ఈ సినిమా మొదటి వారం లోనే ఆ మార్క్ ని టచ్ కానుంది. మరోవైపు యూఎస్ లో కూడా ప్రతిరోజూ పండగే హవా కొనసాగుతోంది.
‘ప్రతిరోజూ పండగే’ 6 డేస్ ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:
నైజాం- 6.6 కోట్లు
సీడెడ్- 1.91 కోట్లు
గుంటూరు- 1.06 కోట్లు
ఉత్తరాంధ్ర- 2.22 కోట్లు
తూర్పు గోదావరి- 1.09 కోట్లు
పశ్చిమ గోదావరి- 85 లక్షలు
కృష్ణా- 1.15 కోట్లు
నెల్లూరు- 50.5 లక్షలు
————————————————-
6 డేస్ మొత్తం షేర్- 15.38 కోట్లు
————————————————-
కర్ణాటక +ఇండియా- 1.04 కోట్లు
ఓవర్సీస్- 2.12 కోట్లు
————————————————-
వరల్డ్ వైడ్ 6 రోజుల షేర్- 18.54 కోట్లు
————————————————-