మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ పూజా హెగ్డే. గత సంవత్సరం అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురం సినిమా తో ఇండస్ట్రీ హిట్ ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు రాధేశ్యామ్ మూవీ తో కూడా వచ్చే ఏడాది సక్సెస్ అందుకోవాలని చాలా ఆత్రుతగా ఉన్నది. అంతే కాకుండా ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించడం గమనార్హం.
ఇక మరొకవైపు తమిళంలో కూడా స్టార్ హీరోలతో కూడా నటించడానికి రెడీ అయిపోయింది ఈమె. ప్రస్తుతం టాలీవుడ్,కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా బిజీ గా మారిపోయింది పూజా హెగ్డే. సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది పూజా హెగ్డే. తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల మాల్దీవుల్లో వరుస బికినీ షూట్ లతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇప్పుడు టూపీస్ ఫోటోని షేర్ చేసి, ఎంతో హాట్‌గా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆ ఫోటో ని మీరు కూడా ఒకసారి చూడండి.