పవన్ బర్త్ డేకి స్పెషల్ ట్రీట్ ఉందా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ విదితమే. ‘వకీల్ సాబ్’ చిత్రంతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ ‘హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్, హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో మూవీ’ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో క్యూట్ హీరోయిన్ నిత్య మీనన్ నటిస్తోంది.

 

ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తుండగా, పవన్ ఫ్యాన్ సాగర్.కె.చంద్ర డైరెక్టర్. ఇకపోతే ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌పై మేకర్స్ ఇటీవలే ఓ అప్ డేట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. ఇది ఊర మాస్ సాంగ్ అని తెలుస్తుండగా, దీనిని సింగర్ శ్రీకృష్ణ పాడారు. ఈ సినిమాకు ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ డైరెక్టర్. అయితే, ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ పవన్ బర్త్ డే రోజున ఇవ్వబోతున్నట్లు వార్తలొస్తుండగా, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు.

Share.