Google+ Pinterest LinkedIn Tumblr +

పవర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ప్రజల్లో ఉన్న క్రెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు.పవన్ ఎక్కడికన్నా వస్తున్నాడంటే చాలు ఆయన్ని చూడడానికి అభిమానులు గుంపులు గుంపులుగా వచ్చేస్తుంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయ‌క్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ చిత్రంలో కొత్త షెడ్యూల్‌ను వికారాబాద్ మ‌ద‌న్‌ప‌ల్లిలోని ఎల్ల‌మ్మ దేవాల‌యం వ‌ద్ద ప్రారంభించగా పవన్ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారని తెలిసి భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకొనిప‌వ‌న్ క‌ళ్యాణ్ అని గట్టిగట్టిగా అరుస్తూ నినాదాలు చేశారు.వారిని చుసిన పవన్ కారులోంచి బ‌య‌ట‌కు ఫ్యాన్స్ కు అభివాదం చేసారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.అంతేకాకుండా షూటింగ్ లో పాల్గొన పవన్ పోలీస్ డ్రెస్ వేసుకుని బైక్ రైడింగ్ చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి కార్ లో నుంచి వీడియో తీసి దానిని నెట్టింట పోస్ట్ చేసాడు. ఇంకేముంది పవన్ కళ్యాణ్ బైక్ రైడ్ మాములుగా లేదుగా అంటూ నెటిజన్స్ ఈ వీడియోను కూడా వైరల్ చేసారు.

Share.