బంగార్రాజు మూవీ నుండి.. వాసివాడి తస్సాదియ్యా టీజర్ రిలీజ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ప్రధాన పాత్రల్లో కలిసి నటిస్తున్న తాజా చిత్రం.”బంగార్రాజు” ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన పోస్టర్స్, వీడియో లు, పాటలు ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక అంతే కాకుండా మనం సినిమా తర్వాత తండ్రీకొడుకులుగా నటించడం గమనార్హం.

తాజాగా బంగార్రాజు మూవీ నుండి మరొక లిరికల్ సాంగ్ విడుదల కి సిద్దం అయింది. ఈ చిత్రం నుండి వాసివాడి తస్సాదియ్యా టీజర్ రిలీజ్ అయింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ పాటలో జాతిరత్నాలు హీరోయిన్ ఫారియా అబ్దుల్లా తో కలసి నాగార్జున నాగచైతన్య స్టెప్పులు అదరగొట్టారు అని చెప్పవచ్చు. ఇక దీంతో అక్కినేని అభిమానులకు ఆనందానికి అవధులు లేవు.

Share.